వరంగల్‌ జిల్లాలో  గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు 

వరంగల్‌ జిల్లాలో  గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు 

ములుగు/ కాశీబుగ్గ (కార్పొరేషన్)/​ఇల్లందు/ నల్లబెల్లి, వెలుగు: గణేశ్‌‌‌‌‌‌‌‌ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో బుధవారం జరగనున్న విగ్రహాల నిమజ్జనానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ములుగు, వరంగల్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ప్రధాన చెరువులు, కుంటలు, నిమజ్జన ప్రాంతాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ములుగు జిల్లాలో 815 వినాయక విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉండగా, సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుధీర్‌‌‌‌‌‌‌‌ రాంనాథ్‌‌‌‌‌‌‌‌ కేకన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో అనుచిత, వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ ట్రైసిటీ పరిధిలో సుమారు 19 ప్రధాన చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేపట్టారు. 30 క్రేన్లు, 145 మంది గజ ఈతగాళ్లు, 500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తులు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇల్లెందు పట్టణంలోని సుమారు 120 గణనాథులను భద్రాచలంలో నిమజ్జనం చేయాలని మున్సిపాలిటీ నిర్ణయించింది.

ఇందుకోసం లారీలను ఏర్పాటు చేసి, ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి వార్డు నుంచి వచ్చే విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్‌‌‌‌‌‌‌‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఖమ్మం నగరంలో 2 వేలకు పైగా విగ్రహాలు మున్నేరు, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ చిన్న మున్నేటి వద్ద నిమజ్జనం కానున్నాయి. మున్నేరులో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో దంసలాపురం వద్ద ప్రత్యేక నిమజ్జన ఘాట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు.

పోలీసు శాఖ ఊరేగింపు మార్గాలను ప్రకటించగా, నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భక్తులు, ఉత్సవ కమిటీలు అధికారులకు సహకరించాలని ఆఫీసర్లు కోరారు. శోభాయాత్రలో నిబంధనలు పాటిస్తూ, నిర్ణీత సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని  సూచించారు.